Saturday, November 23, 2024

ప్ర‌జా సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే జోగు రామ‌న్న‌

దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామ‌న్న అన్నారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్‌కు చెందిన 100 మంది యువకులు జోగు రామన్న సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,000 ఉద్యోగాలను ముఖ్యమంత్రి కేసీఆర్ భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement