జన్నారం, (ఆంధ్రప్రభ) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జాడి మురళిని…. చీటింగ్ కేసులో శుక్రవారం సాయంత్రం జన్నారం పోలీసులు అరెస్ట్ చేశారు.
మండలంలోని కలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మామిడి నర్సయ్యకు.. తన్విత ఆయుర్వేద స్వీమ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని జాడి మురళి మాయమాటలు చెప్పాడు. మురళి మాయమాటలు నమ్మి రూ.24 లక్షలు పంపించాడు మామిడి నర్సయ్య.
తీరా అది మోసమని గ్రహించిన మామిడి నర్సయ్య… గత నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మామిడి నర్సయ్య ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు మురళిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుండేటి తెలిపారు. కేసు విచారణ అనంతరం సాయంత్రం మురళిని అరెస్టు చేసి లక్షేటిపేట కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
- Advertisement -