Saturday, November 23, 2024

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : అద‌నపు కలెక్టర్ రాజేశం

ఆసిఫాబాద్ రూరల్, జూన్ 9 (ప్రభ న్యూస్) : మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అద‌నపు కలెక్టర్ రాజేశం అన్నారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా జిల్లాకేంద్రంలోని ఆదివాసీ భవనంలో రెండవరోజు నిర్వహించిన చేప ఆహార పండుగ ( ఫుడ్ ఫెస్టివల్) సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం జలాశయాలలో చెరువులలో ఉచితంగా వేలాది చేప పిల్లలను విడుదల చేయడంతో మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నరని అన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటైన సొసైటీకి ధృవీకరణ పత్రం అందచేశారు. చేపలతో చేసిన ఫిష్ బిర్యానీ చేప పచ్చళ్ళు ఫిష్ ముర్కు తదితర నోరూరించే వంటకాలతో ప్రాంగణం ఘమ‌ఘుమ‌లాడింది. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖాధికారి వై విజయ్ కుమార్, ఎఫ్ఎఫ్ఓ మధుకర్, జెఏ శ్రీనివాస్, ఎఫ్ఏ నరేష్, ఎఫ్ఎంలు వసంత, రాంరాజ్, శేఖర్, నగేష్, డీఈఓ తిరుపతి, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు యాదగిరి, మత్స్యకారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement