Friday, November 15, 2024

ADB | పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కడెం, నవంబర్ 13 (ఆంధ్ర ప్రభ) : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. బుధవారం కడెం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 31మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు.

కళ్యాణ‌లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం వల్ల పేదలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పి.సతీష్ రెడ్డి, కడెం డి టి.శంకర్ యమ్.పి.డి. ఓ. అరుణ యమ్.పి. ఓ.కవి ఏస్ ఏ .నాగో రావు ఆర్. ఐ.తక్కన్న పాండవ పూర్ పి. ఏ.సి.ఏస్.చైర్మన్ రామడుగు శైలజ రమేష్ రావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుర్గ భవాని, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్ల వెంకటేష్, భూషణ్, వాజిద్ ఖాన్, శంకర్, ఎం లక్ష్మణ్, రాజేశ్వర్ రెడ్డి, బొడ్డు గంగన్న, రాజన్న, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement