Friday, November 22, 2024

పక్కనే గోదారి.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో గత కొన్ని రోజుల నుంచి నీటి కష్టాలు ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి. గ్రామ పంచాయతీకి సంబంధించిన మోటార్లనే చెడిపోవడంతో నీటి కొరత ఏర్పడింది. బాసర మండల కేంద్రంలోని ప్రధాన వీధులలో నీటి కష్టాలు అధికంగా మారడంతో బాసర మాజీ సర్పంచ్ ప్రజల సమస్యలు తెలుసుకొని ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేశారు. దీనికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా సంబంధిత అధికారులు వెంటనే ఈ సమస్యను తీర్చాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో సంబంధిత ఈవోకి వినతి పత్రాన్ని సమర్పించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. గోదావరి నది పక్కనే ఉన్న గ్రామంలో నీటి సమస్య తీరడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల అనే కార్యక్రమం ద్వారా నీటిని సరఫరా చేసిందని ఎంతో గొప్పగా చెప్పుకుంటుందని కానీ బాసర మండల కేంద్రంలో ఇంటింటి నల్ల రావడంలేదన్నారు. సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇంటింటి నల్ల పూర్తి కాలేదన్నారు. అధికారులు టైంకు జీతాలు తీసుకుంటున్నారు కానీ ప్రజల సమస్య మాత్రం తీర్చడం లేరన్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు దీనిపై స్పందించలేద‌న్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే నీటి సమస్యలు తీర్చాలని లేని ఎడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గ్రామం ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement