లక్ష్మణ చందా, ఆంధ్ర ప్రభ, ఆగస్ట్ 4 : నిర్మల్ నియోజకవర్గంలో ఇంతవరకు సండే ఎమ్మెల్యేను చూశాం కబ్జాల మంత్రిని చూశాం.. సేవ చేసే నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచాడి శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూచాడి శ్రీహరి రావు వస్తున్నా మీకోసం పాదయాత్ర శుక్రవారం బోరిగాం వడ్డేపల్లి బోరిగం తండ గ్రామాల్లో అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ మేనిఫెస్టోలో వివరిస్తూ ఉత్సాహంగా సాగింది. గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామ మహిళలు, యువకులు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. భాజా భజంత్రీలతో గ్రామంలో ప్రతి గడపకు వెళుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను వివరిస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేసే మేనిఫెస్టో గురించి మహిళలకు వివరిస్తూ ముందుకు సాగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైలెవెల్ కెనాలను పనులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, అంతేకాకుండా లింగంపల్లి గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను డి1 పట్టాల పేరిట తన బంధువులకు దోచి పెట్టారన్నారు. ఇక మరొక నాయకుడు బిజెపి కి చెందిన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గతంలో యువతకు న్యాయం చేస్తానంటూ నిర్మల్ లో ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించి ఎన్నికలు ముగియగానే దానిని హైదరాబాద్ తరలించి అధిక లాభాలకు అమ్ముకున్నాడని ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆదివారం తప్ప నిర్మల్ కు రాలేని మనిషి అన్నారు. గత ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసి ఓటమి చెందిన తనకు ఒక్కసారి సేవ చేసే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని శ్రీహరి రావు ప్రజలను కోరారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి రెడ్డి రాజేశ్వర రెడ్డి రామ్ రెడ్డి, వడ్నాల రాజేశ్వర్, ఈటెల శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, సాధం సుదర్శన్, గంగాధర్ గౌడ్, ఈటెల శ్రీనివాస్, నాందేపు చిన్ను బొరిగం సర్పంచ్ లతోపాటు పలువురు మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నిర్మల్ నుండి తరలివచ్చిన మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.