బెల్లంపల్లి : నల్గొండ జిల్లా పెద్దకూర మండలం కర్ణెకుంట గ్రామపంచాయితీలో యాదవుల ఆరాధ్య దైవం గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ జాతర కొట్టె రామలింగయ్య, సర్పంచ్ అహల్యమ్మ, రాంజీ యాదవ్ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల పెంపకం ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి కొమ్ము అశోక్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. గంగమ్మ తల్లి చాలా గొప్ప దేవత అని, యాదవులు కోరిన కోర్కెలు తీర్చిన దేవత అని, గ్రామ ప్రజలంతా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహించడం జరుగుతుందని, ఈ జాతరలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ జాతరలో మాజీ సర్పంచ్ లక్ష్మయ్య యాదవ్, కొండయ్య యాదవ్, పాకాల శంకర్, ఏడుకొండలు, రాగం లక్ష్మణ్, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement