Friday, November 22, 2024

ADB: సినీ ఫక్కీలో నలుగురు దోపిడీ దొంగల ముఠా అరెస్ట్…

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్: గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి సునాయాసంగా డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా చాకచక్యంగా దోపిడీకి పాల్పడుతూ పోలీసుల వలకు చిక్కారు. నిందితులే బాధితులుగా న‌మ్మిస్తూ.. సినీ ఫక్కీలో దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్పీ గౌడ్ సలాం గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఆదిలాబాద్ పట్టణం వడ్డెర కాలనీకి చెందిన మీర్జ ముషరఫ్ బేగ్ అలియాస్ ముషరఫ్, ముస్సు, షేక్ బిలాల్, గజ్బే అక్షయ్, జైనథ్ మండలం రామాయి గ్రామానికి చెందిన మేస్రం దత్తు అనే నలుగురు నిందితులు దోపిడీ దొంగతనాలకు పాల్పడుతూ డబ్బుతో జల్సాలు చేయడం, గంజాయి, మందు లాంటి మాదక ద్రవ్యాలను సేవించడం అలవాటుగా చేసుకున్నారు. డబ్బుల కోసం హత్యలు, దోపిడీలు, ద్విచక్ర వాహనాల దొంగతనాలు, ఇళ్ల దొంగతనాలు లాంటి పలు రకాల నేరాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలియజేశారు.

ఈ ముఠా తెలంగాణ మహారాష్ట్రలో అనేక దోపిడీలు చేసినట్టు వెలుగు చూసిందని, నిందితుల వద్ద నుండి కారు, ఆటో, సెల్ ఫోన్, 4000 నగదు స్వాధీన పరచుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసును చేధించిన డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డిని, టూ టౌన్ సిఐను, ఐటీ కోర్ సిబ్బంది సంజీవ్ కుమార్, ఎం ఏ రియాజ్, క్రైమ్ పార్టీ సిబ్బంది రమేష్, నరేష్, క్రాంతి, నరేందర్, సురేందర్ రెడ్డిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరిపై ఇప్పటికే 20 కేసులు నమోదై ఉన్నట్టు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement