తాండూరు మండలం వెంకయ్యపల్లి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో ప్రమాధవశాత్తు అడవి దున్న పడిపోయింది. బావి వద్ద అరుపులు విన్న గ్రామస్తులు బావి వద్దకు వెళ్లి చూడగా దున్నపోతు కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో బెల్లంపల్లి అటవీశాఖ అధికారి మజారోద్దిన్, బీట్ అధికారులు అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో బావిని తవ్వి అందులోని అటవి దున్నపోతును రక్షించి అడవిలోకి వదిలేశారు. వేసవి కాలం దృష్ట్యా వాగులో అడవులు ఎండిపోవడంతో నీటి కోసం అటవీ జంతువులు గ్రామాల్లోకి వస్తూ ప్రమాధాల్లో చిక్కుకుంటున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement