Tuesday, September 17, 2024

ADB: మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు వర్ధంతిని జయప్రదం చేయాలి : ఎమ్మెల్యే

ఉట్నూర్, ఆగస్టు 26 (ప్రభన్యూస్) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్నాక్ భీంరావు తొలి ఆదివాసీల ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నికై ఈ ప్రాంతానికి మంచి సేవలందించారని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని తన కార్యాలయంలో వర్ధంతి పోస్టర్లను రాజ్ గోండు సేవా సమితి, వర్ధంతి నిర్వహణ కమిటీ సభ్యులతో కలసి విడుదల చేశారు.

ఈ సందర్బంగా నిర్వహణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఈనెల 29న ఉట్నూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు వర్ధంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని, కావున ఆదివాసీలు, ప్రజలు, విద్యార్థులు, మేధావులు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలన్నారు.

అనంతరం రాజ్ గోండు సేవా సమితి సభ్యులు ఐటీడీఎ పీఓకు సివిల్ సూటులను విచారించే అధికారం లేదని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకొని మళ్ళీ ఐటీడీఏ పీఓకు సివిల్ సూటులను విచారణ చేసే విధంగా అధికారాలు ఇవ్వాలని కోరుతూ… ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోట్నాక్ భీంరావు వర్ధంతి నిర్వహణ కమిటీ సభ్యులు, రాజ్ గోండు సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement