ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. బుధవారం సాయంత్రం పడిన పిడుగుల కారణంగా ఐదుగురు రైతులు మృతి చెందారు. వేర్వేరు ప్రాంతాల్లో పొలాల్లో పనిచేసుకుంటున్న వారిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించారు. తానూరు మండలం, కోలూరు శివారులో పంటచేనులో పిడుగు పడి మధవరావు అనే రైతు మృతి చెందాడు. ఇదే జిల్లాలోని కుంటాల మండలం, విటాపూర్ గ్రామ సమీపంలోని పంట చేనులో పిడుగుపటుకు గురై విజయ్ అనే యువరైతు చనిపోయాడు. ఈ ఘటనలో పక్కనే ఉన్న ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
రెబ్బెన మండలం, వంకలం శివారులో పంటచేనులో పిడుగుపడి పాత్రు అనే రైతు మృతి చెందాడు. అలాగే కెరామెరి మండలం సాంగ్వి గ్రామంలో చేనులో పనిచేస్తుండగా పిడుగు పడి యువరైతు పురుషోత్తం మృత్యువాత పడ్డాడు. బోథ్ మండలం కుచులాపూర్ గ్రామ శివారులో పంటచేనులో పిడిగిపడి లక్ష్మణ్ అనే రైతు మరణించాడు. రెండు ఎద్దులు మృతిచెందాయి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్ బాలానగర్లో భారీ అగ్నిప్రమాదం