Tuesday, October 29, 2024

ADB | చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి…

దండేపల్లి, (ఆంద్రప్రభ) : గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు గోదావరి నీటిలో మునిగి మృతి చెందినట్లు దండేపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు.

దండేపల్లి మండలం కన్నెపల్లి కి చెందినమగ్గిడి కిషోర్ (30) గత గురువారం గూడెం గోదావరికి చేపల వేటకు వెళ్ళాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కిషోర్ భార్య పల్లవి శుక్రవారం పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. ప‌ల్ల‌వి ఫిర్యాదు మేర‌కు మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

అయితే, శనివారం గూడెం గోదావ‌రిలో శ‌వ‌మై తేలిన‌ట్లు వారి బందువులు తెల‌ప‌డంతో మృతుని భార్య ప‌ల్ల‌వి.. పోలీసుల‌కు స‌మాచారం అందించింది. దీంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిర్వ‌హించి, కేసున‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు ఎస్ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement