చెన్నూర్, ప్రభన్యూస్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని అస్నాద్ గ్రామంలో ఇవ్వాళ మధ్యాహ్నం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇంగిలి లింగయ్య, శ్రీనివాసులుకు చెందిన రెండు ఇళ్ళు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనను చూసిన ఇరుగు పొరుగు వారు గమనించి చెన్నూరులో ఉన్న అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
- Advertisement -