తాండూరు : నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని బెల్లంపల్లి వ్యవసాయ సంచాలకులు సురేఖ అన్నారు. పెగడపల్లిలో పంటకల్లాలను పరిశీలించిన అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు నకిలీ పత్తి విత్తనాలు కొని మోసపోవద్దని, లైసెన్స్ కలిగిన విత్తన దుకాణాల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. నాణ్యమైన, ఆరోగ్యవంతమైన పంటలను పండించాలని సూచించారు. నకిలీ విత్తనాలను ఎవరైనా విక్రయించినట్లయితే సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. మోతాదుకు మించి పంటలకు ఎరువు మందులు, పురుగు మందులను వాడవద్దని, వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని పేర్కొన్నారు. ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రైతులు పట్టా పాస్ పుస్తకాలను తీసుకువెళ్లాలని వివరించారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు పంట కల్లాలను నిర్మించుకోవాలని, ఈ సదావకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఆమె వెంట వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఏఈఓ పుష్పలత, సర్పంచ్ రజిత, టిఏ లక్ష్మి, పిఓ తపస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement