Saturday, September 7, 2024

ABD | జిల్లాలో పలుచోట్ల ఎక్సైజ్ దాడులు..

జన్నారం, జూలై 25 (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో లక్సెట్టిపేట ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు (గురువారం) దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 385 కిలోల బెల్లం, 26 లీటర్ల నాటు సారా, 30 లీటర్ల టేబుల్‌ను స్వాధీనం చేసుకుని, 100 లీటర్ల బెల్లం పానీయాన్ని ధ్వంసం చేశారు.

ఆదిలాబాద్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహ్మారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కెజి నందగోపాల్ (గురువారం) ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని పలు గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటు సారా తయారు చేస్తున్న వారిని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి బెల్లం ప‌ట్టిక‌ను స్వాధీనం చేసుకున్నట్లు లక్సెట్టిపేట ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.నర్సింహులు తెలిపారు.

ఎక్సైజ్ సర్కిల్ లోని చింతగూడెం, జువ్విగూడ, పొనకల్, జన్నారం, సేవాదాస్ నగర్, తొమ్మిది గుడిసెలపల్లి, రేండ్లగూడ, దండేపల్లి, తాళ్ల పేట, లింగాపూర్, తానిమడుగు గ్రామాల్లోని షాపులపై ముకుమ్మడిగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఆయా గ్రామాలకు చెందిన భూక్య లలిత, బోడ సావిత్రి, బానావత్ సుజాత, జరుపుల సంగీత, ఎ. నరేష్, ఆకుల శంకరయ్య, పి. కిష్టయ్య, గాజుల స్వామి, బాణావత్ గురువయ్య, బండారి లక్ష్మీనారాయణ, బానావత్ తుకారాం నుంచి 385 కిలోల బెల్లం, 30 కిలోల పటిక, 26 లీటర్ల నాటు సారా పట్టుకున్నట్లు తెలిపారు. 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు వివరించారు.

ఇక‌ ఈ దాడుల్లో సీఐ గంగారెడ్డి, టాస్క్‌ఫోర్స్ సీఐ సమ్మయ్య, లక్షెట్టిపేట ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్ ఇష్పత్తిరావు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, సాగర్, వెంకటేష్, సుజాత, శిరీష, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement