- ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
జన్నారం రూరల్, ( ఆంధ్రప్రభ) : పల్లె ప్రజలకు వైద్య సేవలు అందించడం ఎంతో ముఖ్యమని ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్ అన్నారు. జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర గ్రూప్, మంచిర్యాల మేడిలైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కరిమల జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీ, లక్షేట్టిపేట మున్సిపల్ కోర్టుజడ్జి హసదుల్లా షరీఫ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ… ఉచిత వైద్య శిబిరానికి చికిత్స కోసం పల్లెల నుంచి జనం రావడం సంతోషకరమని ఆయన తెలిపారు. ప్రజాసేవలో ప్రతి ఒక్కరు ముందుండాలని ఆయన సూచించారు. పల్లె జనానికి ఉచిత వైద్యాన్ని అందిచాలనే ఆలోచన ఎంతో మంచిదన్నారు. వైద్య శిబిరం నిర్వహించిన రాఘవేంద్ర గ్రూప్స్ చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్ ను మంచిర్యాల మేడిలైఫ్ ఆసుపత్రి యాజమాన్యాన్ని, వైద్యులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు నితీష్ రాథోడ్, మంచిర్యాల మేడిలైఫ్ ఆసుపత్రి వైద్యుడు ఎం.డి చేతన్ చౌహాన్,ఉపిరితిత్తుల వైద్యులు కుమారాస్వామి,డి శ్రీనివాస్, స్థానిక వైద్యులు యాదగిరి లక్ష్మణరావు,రాఘవేంద్ర కరిమల జూనియర్ కళాశాల, లిటిల్ హ్యాన్స్ కరస్పాండెంట్ ఎర్ర సంపత్, ప్రిన్సిపాల్స్ ఎదులాపురం లక్ష్మణ్, శ్రీనివాస్,డైరెక్టర్లు ఎర్ర మహేష్,ఎర్ర నరేష్, లక్షేటిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్, బిజెపి మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు, బిజెపి గిరిజన మోర్చాజిల్లా అధ్యక్షుడు బద్రినాయక్ ,తదితరులు పాల్గొన్నారు.