Friday, November 22, 2024

ADB: ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి..

నస్పూర్, ఆగస్టు 8(ప్రభ న్యూస్) : ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 23 వార్డుల్లో గల ఇందిరమ్మ కాలనీలో గురువారం స్వచ్ఛధనం-పచ్చదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ మొక్కలు విరివిగా నాటితే పచ్చదనం పెరిగి భవిష్యత్తు తరాలు బాగుంటాయని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేక అధికారి, డీఆర్ డీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ కిషన్, మున్సిపల్ చైర్మన్ వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజిత, కమిషనర్ చిట్యాల సతీష్, స్థానిక కౌన్సిలర్లు అగల్ డ్యూటీ రాజు, సంధ్యారాణి, మెప్మా టీఎంసీ నాగరాజు, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement