తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో భూకంపం వచ్చింది. జిల్లాలోని ఉట్నూరులో స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం రాత్రి 11.23 గంటల సంమయంలో భూకంపం సంభవించింది. అంతా నిద్రలో ఉన్న సమయంలో భూ ప్రకంపణలు రావడంతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. ఇండ్లలో నుంచి రోడ్లపైకి పరుగులుతీశారు. రెండు సెకన్లపాటు భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. భూకంప తీవ్రతకు ఇండ్లలోని వస్తువులు కదిలిపోయాయని చెప్పారు. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైందని అధికారులు తెలిపారు. ఉట్నూరు మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని, భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులు భూకంపం వచ్చినట్లు వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement