Monday, November 18, 2024

డివైజీఎంకు వినతి పత్రం..

బెల్లంపల్లి : ఎక్స్‌ఫ్లోరేషన్‌ డివిజన్‌ సింగరేణి కాలరీస్‌ బెల్లంపల్లి కాలనీలో 2008 నుండి 2021 నేటి వరకు 13 సంవత్సరాలుగా సింగరేణి కంపెనీలో కాంట్రాక్ట్‌ కార్మికులుగా సిస్టమ్‌ ప్రారంభం నుండి రోజుకు షిఫ్టుకు కేవలం రూ.60 జీతం నుండి ఎక్స్‌ఫ్లోరేషన్‌ డివిజన్‌లో గోలేటి నుండి గోదావరి ఒడ్డు వరకు గల అన్ని ప్రాంతాల్లో డ్రిల్స్‌ నడిపిస్తూ ప్రతీ ప్రాంతంలోని సింగరేణి కార్మికులతో సమానంగా విధులు నిర్వహించి సింగరేణి అభివృద్ధికి మేము కూడా పాటుపడ్డామని, వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా అడవుల వద్ద ఉన్న డ్రిల్స్‌ వద్దకు పోయి ప్రాణాలకు తెగించి పనిచేశామని, ప్రస్తుత నిరుద్యోగ పరిస్థితుల్లో 13 సంవత్సరాలుగా చాలిచాలని జీతాలతో కుటుంబాన్ని వెల్లదీస్తున్నామని చెప్పారు. నేడు ప్రస్తుతం పిడుగు లాంటి వార్త డ్రిల్స్‌ను ఎత్తివేస్తున్నారనే వార్తతో తమ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని గత 13 సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ప్రకారం ఓపెన్‌కాస్టుల్లో ఉద్యోగాలను కల్పించాలని కోరుతూ డివైజీఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు కాపురపు శ్రీనివాస్‌, మేరె శివకుమార్‌, మార్క రవీంధర్‌గౌడ్‌, ఆవునూరి శంకర్‌, మహ్మద్‌ గౌస్‌, ఇప్ప స్వామి, బండి లక్ష్మణ్‌, జంగపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement