భీమిని: భీమిని మండల ప్రత్యేధికారిగా బెల్లంపల్లి డీఎల్‌పీఓ ఫణీందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ప్రత్యేకాధికారిగా పనిచేసిన ఆర్డీఓ శ్యామలాదేవిని రెవెన్యూ పనులు ఎక్కువగా ఉండటంతో ఆమెను తప్పించి బెల్లంపల్లి డీఎల్‌పీఓగా పనిచేస్తున్న ఫణీందర్‌రావుకు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని, ఆమె ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించినట్లు డీఎల్‌పీఓ ఫణీందర్‌రావు తెలిపారు. అనంతరం మండల పరిషత్ సమావేశంలో కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, ఐకేపీ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేకాధికారి మాట్లాడుతూ పల్లె ప్రగతి పనులను వేగవంతం చేయాలని, మిగిలిపోయిన శ్మశానవాటికలు, కంపోస్టు షెడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కార్యదర్శులు తమ గ్రామపంచాయితీల పరిధిలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను చేయించడంతో పాటు హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలకు సక్రమంగా నీటిని అందించాలని, మిషన్ భగీరథలో భాగంగా నీటి సరఫరా జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ప్రతీరోజు మంచినీటిని ప్రజలకు అందించేలా చూడాలని, వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా వెంటనే సమస్యను పరిష్కరించుకోవాలని, పల్లె ప్రకృతి వనాలను తీర్చిదిద్దాలని, అందులో నాటిన ప్రతీమొక్కను బ్రతికించేలా చూడాలని కార్యదర్శులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ రాధాకృష్ణ, ఎంపీఓ విజయ్‌ప్రసాద్, ఏపీఓ భాస్కర్‌రావు, కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, ఐకేపి సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement