వేమనపల్లి : మండలంలోని నాగారం గ్రామపంచాయితీలో శానిటేషన్, పల్లె ప్రగతి పనులను ఇంపాక్టేషన్ యాప్ ద్వారా డీఎల్‌పీఓ ఫణీంధర్, ఎంపీఓ అనీల్‌కుమార్‌లు పరిశీలించారు. నర్సరీ, పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, వైకుంఠదామంను పరిశీలించి పలు సూచనలు చేశారు. శానిటేషన్ నిరంతరంగా చేస్తూ రోడ్డు, ప్రభుత్వ భవనాలు, నాలీలను సిద్ధంగా ఉంచాలని, తడి, పొడి చెత్తను సేకరించి వేరు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయితీ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పగటి పూట వీధి దీపాలు వెలగకుండా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తలండి స్వరూపరాణి, పంచాయితీ సెక్రటరి కోడె సంతోష్ రెడ్డి, వన సేవకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement