Monday, July 1, 2024

TG | కుంటాల జలపాతాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా….

నేరడిగొండ,(ప్రభ న్యూస్): నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్‌తో కలిసి పరిశీలించారు. వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి జలపాతం అందాలను తిలకించారు. అనంతరం రోప్ వే గురించి చర్చించి పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అనంతరం హరిత హోటల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.

కుంటాల గ్రామస్తులు హరిత హోటల్‌, తదితర సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి స్థలాన్ని పరిశీలించారు… అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి కుంటాల జలపాతానికి వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను పరిశీలించి టెంట్ల చుట్టూ కాంపౌండ్ నిర్మించాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్, డీపీఆర్వో తిరుమల, ఎమ్మార్వో సంతోష్ రెడ్డి రెవెన్యూ సిబ్బంది, ఎఫ్ఆర్వో గణేష్, బీట్ ఆఫీసర్ భీమ్ జి, కుంటాల గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement