సంగారెడ్డి, (ప్రభన్యూస్): సదాశివపేట మండలంలోని నిజాంపూర్ గ్రామంలో గత వంద సంవత్సరాలుగా మృగశిర కార్తి పురస్కరించుకొని చేప మందు పంపిణీ చేస్తున్నట్లు ఆడెం కుటుంబీకులు మనోహర్ రవీందర్ తెలిపారు. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా చేప మందు పంపిణీ చేయలేకపోయామని వారు తెలిపారు. ఈ సంవత్సరం జూన్ 8 ఉదయం 7:05 గంటలకు మృగశిర కార్తీ ప్రారంభం కానున్నందున చేప మందు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం నిజాంపూర్‌లో చేప మందు కోసం తెలంగాణలోని మెదక్, సిద్దిపేట్, హైదరాబాద్, రంగా రెడ్డి, నిజామాబాద్, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల నుంచి ఆస్తమా ఉబ్బసం, దగ్గు, ఎలర్జీ తదితర వ్యాధుల నివారణ కోసం చేప మందు ఇవ్వడం జరుగు తుందని తెలిపారు.
గ్రామంలోని లోపలి హనుమాన్ మందిరం వద్ద చేప మందు అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు. చేప మందు వేసుకోవడానికి వచ్చిన వారు తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదాశివపేట్ నుండి నిజాంపూర్ గ్రామానికి బస్సులతో పాటు ఆటో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇతర వివరాలకు, 9440362824,9396880163,9652424833 సంప్రదించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.