జన్నారం, జులై 27 (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ కవ్వాల పులుల అభయారణ్యంలోని తాల్లపేట రేంజ్ తపాల్ పూర్ అటవీ సెక్షన్ పరిధిలోని 19వ డిస్ట్రిబ్యూటరీ కాల్వనీటిలో ప్రమాదవశాత్తు పడ్డ జింకపిల్లను భారీ వర్షం లోను అటవీ అధికారులు రక్షించారు.
ఆ కాల్వ నీటి ప్రవాహంలో జింకపిల్ల పడి కొట్టుకుపోతుందనే విషయాన్ని తెలుసుకున్న తపాల్ పూర్ అటవీ సెక్షన్, బీట్ ఆఫీసర్లు ఎస్.కె నహీదపర్వీన్, ఎస్.లక్ష్మీపతి, బేస్ క్యాంపు వాచర్లు అక్కడికి వెళ్లి భారీ వర్షంలోనూ జింకపిల్లను ఆ నీటిలోకి దిగి పట్టుకొని బయటకు తీశారు. ఆ తర్వాత పరీక్షించి హుషారుగా ఉందని గ్రహించి అడవిలో వదిలిపెట్టినట్టు రేంజ్ ఆఫీసర్ సుష్మారావు శనివారం తెలిపారు. ఆ జింకపిల్ల చెంగుచెంగునా గంతులేస్తూ అడవిలోకి పారిపోయిందన్నారు.
- Advertisement -