దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం చరిత్రాత్మకమైనదని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా దళితబంధు ద్వారా మంజూరైన యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధువులారా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందిస్తున్నారన్నారు. లబ్ధిదారులు తమకు ఇష్టమైన వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న బీజేపీ కాంగ్రెస్‌లు వారు అధికారంలో ఉన్న రాష్ట్రంలో దళిత బంధు అమలు చేయాలన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement