కాసిపేట : పర్యారణ రహిత విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సింగరేణి సోలార్ పవర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు డైరెక్టర్ ఇ అండ్ ఎం సత్యనారాయణ రావు పేర్కోన్నారు. మందమర్రి ఏరియా కాసిపేటగని ఇసుకబంకర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన 15 మెగావాట్ల పోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ, నిర్ణీత సమయంలోపే కేంద్రం పనులు పూర్తిచేసి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు. నేలపైన కాకుండా నీటిపై తెలియాడే సోలార్ కేంద్రాలతో పాటు ఇతర రాపోర్టర్ లో సైతం ఏర్పాటు చేయడానికి యాజమాన్యం ఆలోచన చేస్తున్నదని తెలియచేశారు. జల, థర్మల్ విద్యుత్ ఖర్చు కంటే సోలార్ తక్కవ పెట్టుబడితో తయారు కావడం, వినియోగదారులకు చౌకగా అందిరావడం జరుగుతుందన్నారు. సౌర విధ్యుత్ ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని వుండదని అందుకే భవిష్యత్ అంత సోలార్ విధ్యుత్ కేంద్రాల నిర్మాణం వైపు మొగ్గుచూపుతారని వివరించారు. మందమర్రి జియం మాట్లాడుతూ, మార్కెట్లో చౌకగా లభించే వాటికి కొనుగోలుదారులు ఇష్టపడినట్టుగా తక్కవగా అందిరానున్న సోలార్ కరెంట్కే భవిష్యత్లో బాగా డిమాండ్ వుంటుందన్నారు. కార్మికులు ఆరోగ్యంగా వుంటూ రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి లక్షాలను సాధించాలని కోరారు. అనంతరం అధికారులు ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ ఏజియం జగన్ మోహన్రావు, టీబీజీకెఎస్ నాయకులు వొడ్నాల రాజన్న, ఏఐటీయూసీ నాయకులు మిట్టపెల్లి వెంకటస్వామి, దాగం మల్లేష్, స్థానిక సర్పంచ్ ఆడే బాదు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గోన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement