బెల్లంపల్లి : ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని, లేనియెడల చర్యలు తప్పవని ఏసీపీ రహెమాన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచిన రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విధించిన కర్ఫ్యూకు ప్రజలంతా సహకరించాలని అన్నారు. సెకండ్ వేవ్ కరోనా రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు కల్గి ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ నిబంధనలు పాటించాలని, మాస్కు లేకుంటే జరిమానాలు తప్పవని అన్నారు. కరోనా కట్టడిలో ప్రతీఒక్కరు భాగస్వామ్యులు కావాలని సూచించారు. ఆయన వెంట వన్‌టౌన్ సీఐ రాజు తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement