Saturday, September 21, 2024

ADB: జైపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన సీపీ..

మంచిర్యాల ప్రతినిధి (ప్రభ న్యూస్) : జైపూర్ సబ్ డివిజన్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను సందర్శించి పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేయడం జరిగింది.

పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. బ్లూ క్లోట్స్ సిబ్బందితో మాట్లాడి డయల్ 100 కాల్స్ కి స్పందించి, వారు సంఘటన స్థలానికి చేరుకొన్న టైం వివరాలు ట్యాబ్ లో చెక్ చేశారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement