Tuesday, November 26, 2024

కోవిడ్‌ నిర్దారణ పరీక్షలు..

తాండూరు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు కోవిడ్‌ నిర్దారణ పరీక్షలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు తాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆందోళన చేపట్టారు. ఆరోగ్య కేంద్రంలో తక్కువ మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలందరికి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి ఆందోళన చేస్తున్న ప్రజలకు మద్దతు ప్రకటించి మాట్లాడారు. ప్రతీరోజు కేవలం 25 మందికి మాత్రమే పరీక్షలు చేయడంతో చాలా మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ విషయమై వైద్యాధికారి కుమారస్వామిని అడుగగా రోజుకు 25 కిట్లు మాత్రమే వస్తున్నాయని, రోజు 25 మందికి మాత్రమే నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయని, సమస్యను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement