Monday, November 25, 2024

కోవిడ్‌ నిబంధనల మధ్యనే పెళ్లిళ్లు..

బెల్లంపల్లి : పెళ్లి చేసుకోవాలంటే మండల తహశిల్దార్‌ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్‌ భారతి హొళ్లికేరి సూచించారు. అబ్బాయి తరుపున 25 మంది, అమ్మాయి తరుపున 25 మంది 50 మందితో పెళ్లి చేసుకోవాలని సూచించారు. పెళ్లి చేసుకోవాలంటే తహశిల్దార్‌ అనుమతి తీసుకున్న తర్వాతే పెళ్లిళ్లు జరిపించుకోవాలని తెలిపారు. ఒకవైపు మే నెలలో ముహుర్తాలు వందలాదిగా ఉండటంతో పెళ్లిళ్లు చేసుకునే కుటుంబాలకు కరోనా కాటు అడ్డుగా మారింది. పెళ్లంటే వందలాది మంది బంధువులను పిలుస్తూ వారి సమక్షంలో వారి దీవెనల మధ్య చేసుకోవాల్సిన పెళ్లిళ్లు కరోనా తాకిడితో కుటుంబసభ్యుల మధ్యనే పరిమిత మందితోనే పెళ్లిళ్లు చేసుకోవాలని సూచించడంతో ఇప్పటికే చాలా మంది పెళ్లిళ్లకు సంబంధించిన ఫంక్షన్‌హాల్స్‌ను, టెంట్‌హౌస్‌ సామాగ్రి వాటికి బుకింగ్‌ చేసుకున్నప్పటికీ ప్రభుత్వం నిబంధనల మధ్యనే పెళ్లి చేసుకోవాలని చెప్పడంతో నిబంధనలు పాటించక తప్పడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement