శ్రీరాంపూర్ : ఏరియా ఇంచార్జి జనరల్ మేనేజర్ కె.హెచ్.ఎన్.గుప్త చేతుల మీదుగా కరోనా నివారణకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి జీఎం మాట్లాడుతూ సింగరేణిలో చైర్మన్, మ్యానేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ సూచనల మేరకు అన్ని ఏరియాల్లో కరోనా వైరస్ టెస్టింగ్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఉద్యోగులందరికి వ్యాక్సినేషన్ వేయిస్తామన్నారు. సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనా వైరస్ బారీన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలకు సంబందించిన పోస్టర్లను ప్రతీఒక్కరు చదివి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, దీని ద్వారా వారి ఇమ్యూనిటి పవర్ పెరుగుతుందని ఇంచార్జి జీఎం గుప్త తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ కుమార్, డీజీఎం (పర్సనల్) పి.గోవిందరాజు, డీజీఎం క్వాలిటీ నూక రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా నివారణపై పోస్టర్లు రిలీజ్..
Advertisement
తాజా వార్తలు
Advertisement