నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎన్ బి కాలనిలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. వేకువజాము నుండే కాలనీలోని ఇళ్లకు వెళ్లి వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 59 ద్విచక్ర వాహనాలు, 3 ఫోర్ వీలర్స్ పట్టుకున్నట్లు సీఐ శ్రీను తెలిపారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించరాదని, ప్రతి ఒక్క వాహనదారుడు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందులో బీఎస్ఎఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.