మంచిర్యాల, (ప్రభన్యూస్) : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు (ఎస్సీ), బెల్లంపల్లి (ఎస్సీ), మంచిర్యాల నియోజకవర్గాల్లో జరుగుతున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా ఎన్నికల ప్రక్రియ నిర్వాహణ కొరకు ఎన్నికల సాధారణ, ఖర్చుల పరిశీలకులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.
బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులుగా బిశ్వజిత్ దత్తా (ఐఏఎస్), చెన్నూరు నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా సజ్జర్ (ఆర్ఎస్ఐఎస్), చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గ ఖర్చుల పరిశీలకులుగా అశోక్ కుమార్ సత్తార్ (ఐఆర్ఎస్), మంచిర్యాల నియోజకవర్గ ఖర్చుల పరిశీలకకులుగా సీఎస్ పవన్ (ఐఆర్ఎస్)లు నియమింపబడగా పరిశీలకులు జిల్లాలోని నస్పూర్ గల సింగరేణి అతిథి గృహంలో ఉంటారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ పార్టీలు, పోటీ చేయు అభ్యర్థులు చేసే ప్రచారంలో భాగంగా చేయనున్న ఖర్చులను ఎన్నికల ఖర్చుల పరిశీలకు, ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, శాంతిభద్రతల పర్యవేక్షణ, అనుమతులు, ఇతరాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా ఎన్నికల సంబంధిత సందేహాల నివృత్తి, ఎన్నికల నిర్వ వాణలో సమస్యల పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు నస్పూర్ లోని సింగరేణి అతిథి గృహంలో అందుబాటులో ఉంటారని, అదేవిధంగా జిల్లా పోలీస్ పరిశీలకులు ఆర్.ఇలంగో (ఐపీఎస్), శాంతి భద్రతల పరిరక్షణ, పోలీస్ వ్యవస్థ సంబంధిత సందేహాల నివృత్తి, సమస్యల పరిష్కారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో ఎస్టీపీపీ అతిథి గృహంలో సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని, రాజకీయ పార్టీలు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.