జన్నారం, ఫిబ్రవరి 7 (ప్రభ న్యూస్): ప్రజల భాగస్వామ్యంతోనే అడవుల, వన్యప్రాణులు సంరక్షణ సాధ్యమని జిల్లా అటవీ శాఖ అధికారి ఆశీస్ సింగ్ అన్నారు. మంచిర్యాల జిల్లా కవ్వాల పులుల అభయారణ్యం జన్నారం నర్సరీలోని కమ్యూనిటీ హాల్లో బుధవారం ఉమ్మడి జిల్లా అటవీ అధికార్ల సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత తరుణంలో అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. అభయారణ్యంలోని అడవుల, వన్యప్రాణులను కాపాడుకోవడానికి ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలను స్వీకరించాలని ఆయన చెప్పారు. ఉన్న అడవులను కాపాడుకోవడానికి చేపట్టబోయే పలు పనులను ఆయన వివరించారు. నిర్మల్, ఆదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల డీఎఫ్ఓలు, ఎఫ్డిఓలు, రేంజ్ , డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్, బిట్ ఆఫీసర్లు రామ్ కిషన్ యాదవ్, వినయ్ కుమార్ సాహు, హాఫీజోద్దీన్, నాగవత్ స్వామి, గులాబ్ మొయినోద్దీన్, హేమలత, శంకర్, జ్ఞానేశ్వర్ ,తిరుపతి పాల్గొన్నారు.