Friday, November 22, 2024

TS: వరి రైతులకు అండగా కాంగ్రెస్ : వివేక్ వెంకటస్వామి

చెన్నూర్, మే 29(ప్రభ న్యూస్) : వరిధాన్యం పండించిన రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు చెన్నూరు మండలం లోని పలు గ్రామాలలోని వారిధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రతి వరిగింజను కొనుగోలు చేస్తమ‌న్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటేజేషన్ కారణంగా ఫుడ్ కార్పొరేషన్ గోదాంల కొరత కారణంగా కొనుగోలులో కొంత జాప్యం జరిగిందన్నారు.

తను ఎక్కడ ఉన్నా రైతుల వరి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించానన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలులో క్వింటాల్ కు ఐదు ఆరు కిలోల కటాఫ్ కింద రైతులను మోసం చేసి నెలలకొద్ది డబ్బులు రైతు ఖాతాలో జమ చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా రైస్ మిల్లర్లకు హెచ్చరికలు జారీ చేసి రైతులకు నష్టం జ‌ర‌గ‌కుండా చూడడంతో పాటు రెండు మూడు రోజుల్లో ధాన్యం డబ్బులు ఖాతాలో జ‌మ చేయిస్తున్నార‌న్నారు. గత ప్రభుత్వ హయాంలో చేయలేని పనులన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే విపక్షాలకు మింగుడుపడక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని, వరిధాన్యం కొనుగోలులో రైతులు ఎలాంటి అపోహలను నమ్మవద్దన్నారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement