Tuesday, November 26, 2024

ADB: కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

జైనూర్, మే 31(ప్రభ న్యూస్) : పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల యూనిఫామ్ దుస్తులను సకాలంలో కుట్టి పాఠశాలలకు అందించాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. ఆయనతో పాటు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయాన్ని సందర్శించారు. ఐకెపి కార్యాలయంలో జైనూర్ మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రం ఏర్పాటు చేయగా, కేంద్రాన్ని వారు సందర్శించి పరిశీలించారు. మహిళలు యూనిఫామ్ దుస్తులను కుట్టుతున్న విధానాన్ని పరిశీలించి రోజుకు ఎన్ని యూనిఫామ్ దుస్తులు కుడుతున్నారని ఏపీఎం సుజాత సమాఖ్య నాయకురాళ్లతో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పాఠశాలకు చెందిన యూనిఫామ్ దుస్తులు సకాలంలో కుట్టి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాలలోమహిళా సమైక్య సంఘాలకు కమిటీలలో ప్రధాన్యత ఇవ్వడం జరిగిందని కలెక్టర్ అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మహిళా సమైక్య సంఘాల మహిళలు పనులు చూసుకోవాల్సి వస్తుందని, ఆ పనుల పర్యవేక్షణ చేసి, పూర్తి జరిగేలా సమాఖ్య సంఘాల సభ్యులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు చూడాలని కలెక్టర్ కోరారు. తదితర విషయాలపై మండల సమైక్య నాయకురాళ్ల‌తో, అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.

కలెక్టర్ మొదటిసారిగా ఐకెపి కార్యాలయానికి రావడంతో ఐకెపి మహిళా మండల సమైక్య అధ్యక్షురాలు, కార్యదర్శి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఐకెపి మండల సమైక్య సభ్యులు ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేస్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, డి ఆర్ డి ఓ సురేందర్, ఐకెపి ఏపీ డి.రామకృష్ణ, జైనూర్ ఇంచార్జ్ ఎంపీడీవో ప్రవీణ్, త‌హ‌సీల్దార్ తిరుపతి, జైనూర్ ఎంపీఓ ప్రభుదేయ, డీపీఎం సారయ్య, ఐకెపి ఏపీఎం సుజాత, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్ రెడ్డి, మండల సమైక్య అధ్యక్షురాలు కొడప మొతూ బాయి, కార్యదర్శి సుశీల, కోశాధికారి కుమ్ర సుమిత్రభాయి, ఐకెపి ఉద్యోగులు, సమైక్య గ్రామైక్య సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement