నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు బాసర ప్రభుత్వ పాఠశాలలో సైతం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో ఉపాధ్యాయులపై కలెక్టర్ మండిపడ్డారు. విద్యార్థులకు సరిగా చదువులు రావడం లేదని, ప్రభుత్వం పాఠశాలలో అన్ని వసతులున్నా విద్యార్థులు వెనుకబడి ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement