Friday, September 20, 2024

ADB: నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : ఎమ్మెల్యే బోజ్జు పటేల్

ఉట్నూర్, ఆగస్టు 14 (ప్రభ న్యూస్) : నిరుపేదలకు వైద్య చికిత్సల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతో మేలని, ఆర్థికంగా ఎంతగానో దోహదపడుతోందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణ కేంద్రంలోని తన కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు 5,51,000 లక్షల విలువ గల చెక్కులను ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సీఎంఆర్ఎఫ్ పథకం వల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఆపద సమయంలో రోగి ఆపరేషన్ చేసుకోవడానికి అయ్యే ఖర్చును సీఎంఆర్ఎఫ్(ఎల్ఓసి)ను అందించి తద్వారా మెరుగైన వైద్య సేవలు చేసుకొనే వెసులు బాటును ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు.

పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం సంజీవినిలా పని చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ మండల అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యూం, మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్, నాయకులు హజీముద్దీన్ హైమద్, దూట రాజేశ్వర్ జావిద్ అన్సారి, నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement