భీమిని : భీమిని మండలంలోని చిన్నగుడిపేట భీమిని గ్రామపంచాయితీలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాజాత బృంధం ఆధ్వర్యంలో ఆడపిల్లలకు జరుగుతున్న అసమానతలు, బాల్య వివాహాలు, పురిటిలోనే ఆడ పిల్ల అని తెలియగానే చంపేసే విధానాన్ని పాటల ద్వారా కళాకారులు వివరించారు. ఈ కార్యక్రమం మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ సూపర్‌వైజర్ జ్యోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు సత్యనారాయణ, సోమ శేఖర్, కిష్టయ్య, శ్రీనివాస్, నిరోష, చైల్డ్ లైన్ సిబ్బంది, సుజాత, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement