జన్నారం, (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా దంతానపల్లికి చెందిన చింతకింది రమ అనే మహిళ మండలంలోని గొడ్గూడలో బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్ కు వచ్చి తిరిగి వెళుతుండగా… ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని చైన్ స్నాచర్ ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును దొంగలించుకుని పరారయ్యాడు.
ఆమె లబోదిబోమని మొత్తుకునే లోపు ఆ స్నాచర్ వాహనంతో పరుగులు తీశాడు. రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గుండేటి రాజవర్ధన్ తెలిపారు.