కాసిపేట: కాసిపేట మండలం సోమగూడెం (కె) గ్రామ పంచాయతీ కేంద్రంలో నూతనంగా చేపట్టే సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీపీ రొడ్డ లక్ష్మి టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామంలో రోడ్డుకు నిధులు కెటాయించాలని సర్పంచ్ శంకర్ కోరగానే తన జడ్పీ నిధుల నుండి ఐదు లక్షలు చంద్రయ్య మంజూరు చేసినట్టు తెలియచేశారు. సీసీ రోడ్డు నిర్మాణంతో వర్షాకాలం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, సహాకార సంఘం చైర్మన్ నీలా రాంచందర్, టీఆర్‌ఎస్ నాయకులు భీమయ్య, రమేష్ నాయకులు, స్థానికులు పాల్గోన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement