బాసర అక్టోబర్ 29 ప్రభా న్యూస్ ). గోదావరి నది వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటుచేసిన ఆదివారం ముధోల్ సిఐ వినోద్ రెడ్డి బాసర ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో పోలీసు బిఎస్ఎఫ్ సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నాయగవ్ గ్రామానికి చెందిన బాలాజీ వద్ద 13 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు
. ఈ రూపాయలకు బాలాజీ వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు 13 లక్షల రూపాయలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ వినోద్ రెడ్డి మాట్లాడుతు ఎన్నికల నిబంధనలు అనుసరించి 50 వేల కంటే అధికంగా నగదు తరలించొద్దని తరలిస్తే వాటికి తగ్గట్టు రసీదులు ఉంచుకోవాలని సూచించారు.