బెల్లంపల్లి : బెల్లంపల్లి ఏరియాసుపత్రిలో కోవిడ్-19 వ్యాక్సిన్ సెంటర్‌ను బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ సంజీవ రెడ్డి
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపోహలు వీడి 60 ఏళ్లు పైబడి ఉన్న మాజీ సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు 45 యేండ్ల వయసు నుండి 55 యేండ్ల వయసు మధ్య ఉండి బీపీ, షుగర్, గుండెజబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఈ టీకా కార్యక్రమంలో పాల్గొని టీకా వేయించుకోవాలని అన్నారు. టీకా తీసుకునే వారు తమ ఆధార్‌కార్డు, కంపెనీ జారీ చేసిన గుర్తింపు కార్డును, మొబైల్ నెంబర్‌ను, వివిధ జబ్బులకు తీసుకుంటున్న ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన కాగితాలను తీసుకువచ్చి టీకా వేయించుకోవాలని అన్నారు. ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు టీకా వేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకెఎస్ ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు, ఏరియాసుపత్రి డీఐసీఎంఓ శౌరీ, పర్సనల్ మేనేజర్ లక్ష్మణ్‌రావు, ఎన్ రామశాస్త్రీ, మంచిర్యాల ఆసుపత్రి సూపరింటెండెంట్ అరవింద్, ఆర్‌ఎంఓ అనీల్‌రావు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కరోనా వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభం..
Advertisement
తాజా వార్తలు
Advertisement