భీమిని: మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగామ పంచాయితీ ఎస్సీ కాలనీలో తీవ్ర త్రాగునీటి సమస్య ఏర్పడి కాలనీవాసులు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయితీ సర్పంచ్‌కు త్రాగునీటి సమస్యను విన్నవించినా ఏనాడు పట్టించుకోలేదని వీగామ గ్రామపంచాయితీ సందర్శనకు వచ్చిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కాలనీవాసుల నీటి సమస్యను గడ్డం వెంకటేశ్వర్‌గౌడ్ వివరించగా అన్నదే తడువుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ ఇవ్వడమే కాకుండా ఇచ్చిన హామీ మేరకు రూ.36వేల విలువ గల మోటర్ పంపును నేతలకు అందించగా తెరాస మండల అధ్యక్షుడు బోనగిరి నిరంజన్ గుప్త, తెరాస నేత గడ్డం వెంకటేశ్వర్‌గౌడ్ చేతుల మీదుగా మోటర్‌ను బోరుకు అమర్చి నీటిని సరఫరా చేశారు. దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యే ఇచ్చిన మాటను నిలుపుకొని కాలనీవాసుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని, ఇంత త్వరగా కాలనీవాసుల సమస్య పరిష్కారం అవుతుందని, ఊహించలేదని సంబరపడుతున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎంతో రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. వేసవి కాలంలో నీటి కోసం ఎంతో గోస పడాల్సివస్తుందని భయపడ్డామని, మా దాహార్తిని తీర్చిన ఎమ్మెల్యే చల్లంగా ఉండాలని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement