నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఆషాడ మాసం చివరి ఆదివారం కావడంతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు గ్రామస్తులు. ఊరువాడలోని పోచమ్మ మహాలక్ష్మి ఆలయాల్లో భక్తులు సందడి చేస్తున్నారు. తెల్లవారుజాము నుండి మొక్కులు చెల్లించి బోనాలు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ… ప్రజలు పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.
- Advertisement -