Saturday, November 23, 2024

బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడిన సింగరేణి..

కాసిపేట : సింగరేణి ఏటా వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్షాలను నిర్ధేశించుకుని వాటిని సాధించి రికార్డ్‌లను నమోదు చేసుకునే సంప్రదాయానికి గండిపడినట్లైంది. కారణాలు ఏమైనప్పటికి రెండేళ్లుగా అనుకున్న టార్గెట్‌ చేరుకోలేక పోయిందనే వాదనలు మాత్రం వినిపిస్తన్నాయి. సంస్థ సి అండ్‌ ఎండిగా శ్రీదర్‌ బాధ్యతలు చేపట్టాక కొత్త ఆలోచనలతో కంపేనీని పరుగులు పెట్టించారనే పేరువుంది. 2014-15 నుండి ఏటా బొగ్గు ఉత్పత్తిని పెంచి దాన్ని చేరుకునేందుకు కింది స్థాయి అదికారులతో సమాలోచనలు, చర్చలు జరుపుతూ కొత్త రికార్డ్‌లను నెలకొల్పిన అధికారిగా గుర్తింపుతో పాటు పలు అవార్డ్‌లు, ప్రశంసలు పొందారు. అయితే ఈ ఏడాది అంటే 2020-21కి సంస్థ 70 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌ కాగ 50.58 మిలియన్‌ టన్నుటు మాత్రమే సాధించింది. గత ఏడాది సైతం మొదట అంతే టార్గెట్‌ నిర్ణయించగా కరోనా పరిస్థితుల నేపద్యంలో టార్గెట్ ను కుదించినప్పటికి ఆ ఏడాది 2019-20కి 64.02 మిలియన్‌ టన్నులు బొగ్గు ఉత్పత్తిని తీసి లక్ష్యం సాధించలేకపోయింది. 2018-19 సంవత్సరానికి లక్ష్యం దాటి 64.40 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని తీసి అంతకుముందు వున్న రికార్డ్‌లను కొనసాగించింది. ఈ 2018-20 వరకు కంపెని ఆర్జించిన లాభాల్లో వాటా శాతం కార్మికులకు పంపిణి చేయడం జరిగింది. అయితే 2019- 21 వరకు ప్రతికూల పరిస్థితులు, ప్రపంచాన్ని కుదిపివేసిన కరోన కాలంలో ఈ టార్గెట్‌రీచ్‌ కాకపోవడానికి కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. టార్గెట్‌ రాకపోవడానికి పలు కారణాలు నిర్ధేశిత బొగ్గు టార్గెట్‌ రాక పోవడానికి పలు కారణాలను కార్మికులు పేర్కోంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు సంస్థలో కారుణ్యనియామకాల ప్రక్రియ ద్వారా ఉద్యోగాల్లో యువకులు చేరడం, అనుభవం వున్న కార్మికులు రిటైర్డ్‌ కావడం, మరో వైపు అండర్‌గ్రౌండ్‌ గనుల్లో అనుకున్న బొగ్గు ఉత్పత్తని సాదించలేక పోవడం, సంస్థలో యంత్రీకరణ వలన బొగ్గు తీస్తున్న నేపద్యంలో కొన్ని యంత్రాలకు నిర్ణయించిన టార్గెట్లు సాధించలేక పోవడం, కొత్త గనులు రాకపోవడం, ప్రారంభించబడిన గనుల్లో పూర్తి స్థాయి బొగ్గు ఉత్పత్తి జరుగక ఇలా అనేక కారణాలు రెండేల్లుగా లక్షాల వెనుకబాటుకు దోహదం చేశాయనే అభిప్రాయలు వ్యక్తమవుతుతన్నాయి..అనుభవాలను బేరీజువేసుకుని ప్రతినెల టార్గెట్‌లు నిర్ణయించుకుని వాటిని సాధించేదిశలో అధికారులు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఏమైనా ఎంతో ఘన చరిత్రవున్న సింగరేణి భవిష్యత్‌ ప్రణాలికలతో 2021-22లో తిరిగి తన వైభావాన్ని చాటుకుంటుందనే ఆశాభావం కార్మికవర్గం నుండి వ్యక్తమవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement