బోథ్ (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం మహిళ సంక్షేమ దినోత్సవంను బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హాజరయ్యరు. ముందుగా ఉత్తమ అంగన్ వాడిలకు, పంచాయతీ సెక్రెటరీలకు, అటవీ శాఖ వారికి, సర్పంచులకు అదేవిధంగా ఆయా శాఖల్లో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులకు సన్మానించారు. అనంతరం మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.
ఆరోగ్య లక్ష్మీ పథకం ఒక చరిత్ర అని అన్నారు. ఆడ బిడ్డ పుడితే రూ.13000 ఇచ్చేది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అంగన్ వాడిలలో అద్భుతమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ అదేవిధంగా అంగన్ వాడిలకు గౌరవ వేతనం పెంచి అండగా నిలుస్తున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ వికాస్ మొహంత, జడ్పీటీసీ సంధ్యారాణి, సర్పంచ్ సురేందర్, ప్రధాన కార్యదర్శి ఎలుక రాజు తో పాటు బోథ్ నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఐసిడిఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.