Saturday, November 23, 2024

త‌ప్పిన పెను ప్ర‌మాదం.. కూలిన పెద్ద‌వాగు బ్రిడ్జి..

రాష్ట్రంలో గ‌త కొంత కాలంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. ప‌లు చోట్ల వంతెన‌పై నుంచి కూడా నీరు ప్ర‌వ‌హిస్తుంది. అయితే కుమ్రం భీమ్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అందెవెళ్లి వద్ద పెద్దవాగుపై ఉన్న వంతెన కూలిపోయింది. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది. గ‌తేడాదిలోనే వంతెన కుంగిపోగా.. ప్ర‌స్తుతం పూర్తిగా కూలిపోయింది. దీనికి ప్ర‌స్తుతం కురుస్తున్న భారీ వ‌ర్షాలే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. వానలకు పెద్దవాగులో వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగిపోవ‌డంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో వరద తాకిడికి బుధవారం తెల్లవారుజామన బ్రిడ్జి కూలిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. రహదారికి అడ్డంగా రెండువైపులు బారికేడ్లు పెట్టారు. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement