బెల్లంపల్లి: భగత్‌సింగ్ ఉద్యమ స్పూర్తితో యువత మేలుకోవాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి పాత రామ టాకీస్ ముందు గల భగత్‌సింగ్ విగ్రహానికి ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ పూలమాలలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతమాత దాస్య సృంఖలాలను బద్దలు కొట్టి బ్రిటీష్ తెల్ల దొరలను తరిమి కొట్టేందుకు, దేశానికి స్వతంత్ర్యం తేవడానికి నూనూగు మీసాల వయసులోనే ఉద్యమాల బాట పట్టి ఆనాడు పార్లమెంట్‌పై దాడి చేసి చిన్న వయసులోనే ఉరి తాళ్లను ముద్దాడిన యువ కిశోరం, నేటి యువతకు స్పూర్తి ప్రదాత భగత్‌సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్‌డివై జిల్లా కార్యదర్శి పసులేటి వెంకటేష్, ఏఐసీటీయూ జిల్లా అధ్యక్షుడు కొండ శ్రీనివాస్, ఏఐఎఫ్‌డిఎస్ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, అరుణ్, రాకేష్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement