బెల్లంపల్లి : యువతలోని ప్రతిభను వెలికితీసేందుకే కొక్కిరాల రఘుపతిరావు మెమోరియల్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మెఘా టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు అన్నారు. బెల్లంపల్లి ఏఎంసీ-2 గ్రౌండ్‌లో కొక్కిరాల రఘుపతిరావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ముందుగా రఘుపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం క్రికెట్ ఆడి పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో మొత్తం 394 జట్లలో 5008 క్రీడాకారులతో మెగా టోర్నమెంట్‌ను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. యువతలో దాగి ఉన్న ప్రతిభ పాటవాలను వెలికి తీసి వారిని ఉన్నత స్థాయిలో గుర్తించడానికి ఈ పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుల నుండి 34 జట్లు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, కౌన్సిలర్ విజయ పూర్ణిమ, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ఆదర్శ వర్దన్ రాజు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కటుకం సతీష్, మాజీ కౌన్సిలర్ రొడ్డ శారధ, నాయకులు ఎలుక ఆకాష్, ఎస్సీ సెల్ నాయకులు చిన్న రాజం, జమ్మికుంట విజయ్, నాయకులు ఎలుక ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement